Share News

CPI: గౌరవప్రదంగా సీట్లు ఇస్తేనే ‘స్థానికం’లో పొత్తు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:56 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదంగా సీట్లు ఇస్తేనే కాంగ్రె్‌సతో పొత్తు కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

CPI: గౌరవప్రదంగా సీట్లు ఇస్తేనే ‘స్థానికం’లో పొత్తు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా తప్పులు చేస్తే ఊరుకోం: కూనంనేని

హుస్నాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదంగా సీట్లు ఇస్తేనే కాంగ్రె్‌సతో పొత్తు కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కాంగ్రె్‌సతో తాము పొత్తులో ఉన్నామని, అలాగని ప్రభుత్వం తప్పులు చేస్తుంటే.. చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలని, ఇళ్లు ఇవ్వాలని, రైతులను కాపాడుకోవాలని అడిగామని... ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆయా వర్గాల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో బుధవారం జరిగిన సీపీఐ జిల్లా మహసభల సమావేశంలో ఆయన మాట్లాడారు.


జైళ్లలో ఉండాల్సిన వారు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఉంటున్నారని, ప్రజల కోసం జీవించే వారు ఆడవుల్లో, జనం మధ్య ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజల కోసం ఉన్నోళ్లు దేశ ద్రోహులు.. వేల కోట్ల సంపాదన ఉన్నోళ్లు దేశ భక్తులా? ఈ రాజ్యానికి జాలి లేదా? తుపాకీ మడమతో గుద్ది నంబాల కేశవరావును ఎందుకు చంపారు? బీజేపీకి ఎరుపు అంటే భయం. అందుకే కమ్యూనిస్టులను లేకుండా తుడిచేస్తామని అమిత్‌షా విర్రవీగుతున్నాడు. అయితే, కమ్యూనిస్టు పార్టీని ఎవరూ చంపలేరు’’ అని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు లేకుండా తెలంగాణ చరిత్ర లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - Jul 17 , 2025 | 04:56 AM