Jupally : డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: జూపల్లి
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:16 AM
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

వికారాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం, సరఫరాతో సంబంధం ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసి పకడ ్బందీగా విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. వికారాబాద్‌లో కొత్తగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో జూపల్లి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మూలాలను అన్వేషించాలని, ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇటీవల కల్తీ కల్లు తాగి, పలువురు మృతి చెందడం బాధాకరమని జూపల్లి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు.