Jupally Krishna Rao: పర్యాటకులను ఆకర్షించేలా సోమశిల అభివృద్ధి
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:37 AM
తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించేలా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని సోమశిలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించేలా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని సోమశిలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల వద్ద కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్‌ను మంత్రి జూపల్లి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్పీడ్ బోట్ నడిపారు. అనంతరం కృష్ణారావు మాట్లాడారు. సోమశిలకు వచ్చే పర్యాటకులకు వసతులను సమకూర్చడంతో పాటు కృష్ణానదిలో విహరించేలా వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించామని తెలిపారు. సోమశిల అమరగిరి, మల్లేశ్వరం, మంచాలకట్ట ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.