Jupally Krishna Rao: దయ్యాలను పోషించింది కేసీఆరే కదా..?
ABN , Publish Date - May 30 , 2025 | 04:47 AM
కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారని.. ఆ దయ్యాలను పెంచి, పోషించింది కేసీఆరే కదా..? అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, మే 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారని.. ఆ దయ్యాలను పెంచి, పోషించింది కేసీఆరే కదా..? అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గురువారం కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. 21 మంది ముఖ్యమంత్రులు, రూ.65 వేల కోట్ల మేర అప్పు చేసి, ప్రజలకు అనేక సౌకర్యాలను సమకూరిస్తే.. కేసీఆర్ ఒక్కరే దాదాపు రూ.లక్ష కోట్ల వరకు అప్పులు చేసి, ప్రజల మీద మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు.