Share News

JNTU: జేఎన్‌టీయూ బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:56 AM

జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి.

JNTU: జేఎన్‌టీయూ బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

  • అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 25ులోపే

హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి. జనవరిలో నిర్వహించిన మొదటి సెమిస్టర్‌ (రెగ్యులర్‌), రెండో సెమిస్టర్‌ (సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ పోర్టల్‌లో ఉంచినట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ అరుణకుమారి సమాచారం అందించారు. కాగా, వర్సిటీ పరిధిలో మొత్తం 60కి పైగా అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా, వాటిలో చదువుతున్న సుమారు 40వేలమంది ఫస్టియర్‌ విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యారు.


వీరిలో అన్ని సబ్జెక్టులూ పాసైన విద్యార్థులు 10వేల (25శాతం) లోపే ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా మ్యాథ్‌ ్స(ఎం1)లో, ఆపై ఇంజనీరింగ్‌ డ్రాయింగ్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిలైనట్లు విద్యార్థి సంఘాల ప్రతినినిధులు చెబుతున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 04:56 AM