Share News

Secretariat: సచివాలయంలో మళ్లీ ఊడిపడిన పెచ్చులు

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:51 AM

రాష్ట్ర సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం లోపల తూర్పు వైపున గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 29వ గదికి బయట మొదటి అంతస్తు వరకు ఉన్న కిటికీల రెయిలింగ్‌ ఊడిపడింది.

Secretariat: సచివాలయంలో మళ్లీ ఊడిపడిన పెచ్చులు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం లోపల తూర్పు వైపున గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 29వ గదికి బయట మొదటి అంతస్తు వరకు ఉన్న కిటికీల రెయిలింగ్‌ ఊడిపడింది. సీఎం, మంత్రులు ప్రెస్‌మీట్లు నిర్వహించేది ఆ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే కావడం గమనార్హం. రెయిలింగ్‌ ఊడిపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఊడిపడిన పెచ్చులు కాంక్రీట్‌వి కాదని.. కిటికీల చుట్టూ డిజైన్‌ కోసం అమర్చిన జీఆర్‌సీ ఫ్రేమ్‌లని అధికారులు చెబుతున్నారు.


వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సచివాలయం దక్షిణభాగం వైపు ఐదో అంతస్తు వద్ద పోర్టికో మోడల్‌ కోసం అమర్చిన రెయిలింగ్‌ పెచ్చులు ఊడిపోయి.. కింద ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతి కారుపై పడ్డాయి. ‘‘సచివాలయంలో చాలా చోట్ల రెయిలింగ్స్‌, ఫ్రేమ్స్‌లో ఇలాంటి పగుళ్లు ఉన్నాయి. అలంకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ రెయిలింగ్స్‌ను నట్లు, బోల్టులతో అమర్చారు. వాన నీరు లీకవుతుండటంతో అవి ఊడిపడుతున్నాయి’’ అని ఆ ఘటనపై నియమించిన కమిటీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. సచివాలయం లోపల పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్‌లలోనూ పగుళ్లు ఉన్నాయని, నాసిరకం నిర్మాణ పనులే దీనికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:51 AM