Upasana: ఉపాసనకు రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:17 PM
ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, ఆగస్టు 4: మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.
నిన్న సీఎంతో చిరు...
అయితే.. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎంవో ఎక్స్ వేదికగా పోస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న చిరంజీవి సీఎంను కలవడం ఈ రోజు ఉపాసనను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోఛైర్మన్‌గా నియమించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
గౌరవంగా భావిస్తున్న..
తనకి స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్ పదవి రావడంపై ఉపాసన(Upasana) ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దిన ప్రతినిధి సంజీవ్ గోయెంకాతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకి పదవి బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను నిర్మించడానికి, రాష్ట్రంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న క్రీడా పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగుగా ఉపాసన(Upasana) రాసుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
రఘురామ కేసులో మరో కీలక పరిణామం