Share News

BalaKrishna Reaction On Award: అవార్డుపై బాలయ్య రియాక్షన్

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:03 PM

71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఈ అవార్డు రావడం పట్ల బాలయ్య స్పందించారు.

BalaKrishna Reaction On Award: అవార్డుపై బాలయ్య రియాక్షన్
Nandamuri BalaKrishna

హైదరాబాద్, ఆగస్ట్ 01: 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో "భగవంత్ కేసరి" ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర హీరో, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ శుక్రవారం హైదరాబాద్‌లో స్పందించారు. భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణంగా ఉందన్నారు. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కథను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆకాంక్షించారు.


ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దితోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో కష్ట పడ్డారన్నారు. 2023 ఏడాదికి గాను 71వ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. మొత్తం 13 విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 10:38 PM