Share News

Hyd Land Rate: హైదరాబాద్‌లో ఎకరం రూ.104.74 కోట్లు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:35 AM

Land Sale: హైదరాబాద్ శివారులోని భూములను అమ్మేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో ఎకరం భూమి ధర 104.74 కోట్లుగా TGIIC నిర్ధారించింది.

Hyd Land Rate: హైదరాబాద్‌లో ఎకరం రూ.104.74 కోట్లు!
Land Rate

హైదరాబాద్, జులై 29: హైదరాబాద్ శివారులో భూముల వేలానికి రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. రాయదుర్గంలో 4ప్లాట్లు, ఉస్మాన్‌సాగర్‌లో 46 ఎకరాలు, 13 ప్లాట్లు వేలం వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 8వ తేదీ వరకు టెండర్ దాఖలుకు గడువు ఇచ్చింది. అదే రోజు TGIICలో టెక్నికల్ ప్రజెంటేషన్‌తో ఆగస్టు 12న టెండర్ అవార్డ్ చేయనుంది. రాయదుర్గంలోని 15A/2 ప్లాట్‌కు మార్కెట్ ధర రూ.71.60కోట్లుగా నిర్ణయించింది. అలాగే రాయదుర్గంలో మొత్తం 7.67 ఎకరాల భూమి వేలం వేయనుంది. రాయదుర్గంలో ఎకరం భూమి ధర 104.74 కోట్లుగా TGIIC నిర్ధారించింది.


గతంలో రూ.100 కోట్లు పలికిన భూమి...

గతంలో కోకాపేట భూముల వేలంతో కోట్లపేటగా మారింది. భూముల వేలంలో ఎకరం రూ.100.75 కోట్ల రికార్డు ధర పలికింది. 2022లో కోకాపేటలో జరిగిన భూముల వేలంలో అత్యధికంగా ఎకరం రూ.60.20 కోట్లకు దక్కించుకున్న రాజపుష్ప రియల్టీ సంస్థే.. 2023లో ఎకరం రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఎకరాకు రూ.35 కోట్లు కనీస ధరను హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించగా.. అధికారుల అంచనాలకు మించి సగటున ఎకరం ధర రూ.73.23 కోట్లు పలికింది. అయితే ఖజానాలో డబ్బు లోటు ఉన్నప్పుడు ప్రభుత్వాలు భూములను వేలం వేస్తాయన్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Updated Date - Jul 29 , 2025 | 12:28 PM