Share News

KTR: బలగం బృందానికి కేటీఆర్ అభినందనలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:37 PM

2023 ఏడాదికిగాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. టాలీవుడ్‌లోని పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి.

KTR: బలగం బృందానికి కేటీఆర్ అభినందనలు
Ex Minister KTR

హైదరాబాద్, ఆగస్ట్ 01: బలగం చిత్రంలోని 'ఊరు పల్లెటూరు' పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌ను జాతీయ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో కాసర్ల శ్యామ్‌తోపాటు బలగం చిత్ర బృందానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని పల్లె వాసనకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కడం నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.


దూరమవుతున్న మానవ సంబంధాలను తట్టి లేపిన గొప్ప సినిమాలోని 'ఊరు - పల్లెటూరు' పాట కుటుంబాలను ఏకం చేయడమే కాదు మూడు తరాలను దగ్గర చేసిందని గుర్తు చేశారు. ఆ క్రమంలో "బలగం"లోని ప్రతి ఒక్క సభ్యునికి ఈ సందర్భంగా కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.


2023 ఏడాదికిగాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. టాలీవుడ్‌లోని పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. బలగం చిత్రంలో కాసర్ల శ్యామ్ రచించిన ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గీత రచయితగా అవార్డును దక్కించుకున్నారు. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరిని అవార్డు వరించింది. అదే విధంగా హనుమాన్, బేబి, గాంధీతాత చెట్టు చిత్రాలు సైతం అవార్డులు పొందాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

అవార్డుపై బాలయ్య రియాక్షన్

జగన్ పాలనపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 10:40 PM