Share News

Talasani Srinivas: భూకంపం తెప్పిస్తా.. రేవంత్‌కు తలసాని వార్నింగ్!

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:29 PM

Talasani: 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ సర్కార్ మభ్యపెడుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.

Talasani Srinivas: భూకంపం తెప్పిస్తా.. రేవంత్‌కు తలసాని వార్నింగ్!
Talasani Srinivas Yadav

హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శల దాడికి దిగారు. ఇటీవల రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన లెక్కల్లో అనేక తప్పులు ఉన్నాయని ఆరోపించారు. హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం కేంద్రంపై రేవంత్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.


మేము యాచకులం కాదు.. సీఎం సాబ్!

ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అమలు చేయమంటే ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్నారని... అలాంటప్పుడు బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటులో ఆమోదిస్తేనే చట్టబద్ధత వస్తుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అడుక్కోవడానికి తాము యాచకులం కాదని.. ఇది మా బీసీల హక్కు అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Updated Date - Jul 15 , 2025 | 01:29 PM