ఈ కుక్కగారు ఓ ఆఫీసరు...
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:07 PM
బాగా ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు ప్రకృతి అందాలను వీక్షించడం, పెట్స్‌తో కాలక్షేపం చేస్తే ఉపశమనం లభిస్తుందనేది పరిశోధనల్లో తేలింది. అందుకే చాలామంది ఇళ్లలో పిల్లులను, కుక్కలను పెంచుతుంటారు.

బాగా ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు ప్రకృతి అందాలను వీక్షించడం, పెట్స్‌తో కాలక్షేపం చేస్తే ఉపశమనం లభిస్తుందనేది పరిశోధనల్లో తేలింది. అందుకే చాలామంది ఇళ్లలో పిల్లులను, కుక్కలను పెంచుతుంటారు. అయితే ఆఫీసులో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఎలా? అందుకే విదేశాల్లో కొన్ని కంపెనీలు ఆఫీసుల్లో పిల్లులను, పెట్‌డాగ్స్‌ను ఉద్యోగులుగా నియమిస్తున్నాయని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్యపోతుంటాం. అయితే ఈ ట్రెండ్ మనదగ్గర కూడా మొదలయ్యిందని చెప్పొచ్చు.
హైదరాబాద్‌లోని ఒక స్టార్టప్ కంపెనీ గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కకు ఉద్యోగం ఇచ్చింది. అది కూడా ఆఫీసర్ ఉద్యోగం. డెన్వర్ అనే కుక్కను ‘చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్’ (సీహెచ్‌ఓ)గా నియమించుకున్నట్లు సదరు కంపెనీ సహ వ్యవస్థాపకుడు పెట్టిన వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మా ఆఫీసు ఇప్పుడు అధికారికంగా పెట్ ఫ్రెండ్లీగా మారింది. కంపెనీలో ఈ అధికారి మంచి పెర్క్‌లు కూడా సాధిస్తున్నాడు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఆలోచనను చాలామంది స్వాగతిస్తున్నారు. ‘క్యూటెస్ట్ ఆఫీసర్’ అంటూ ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.