Share News

Hanumakonda Hens: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు ప్రత్యక్షం.. కారణమిదే...

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:38 PM

ఓ ఊళ్లో గతవారం సుమారు రెండు వేల నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయ్ గుర్తుందా.? ఆ రోజు సదరు గ్రామస్థులు వాటిని పట్టుకుని, వండుకు తిని ఊరంతా ఓ పండుగలా భావించారు. దానికి కారణమేంటో తాజాగా వెల్లడైంది.

Hanumakonda Hens: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు ప్రత్యక్షం.. కారణమిదే...
Hens Suddenly Appeared in Hanumakonda

హనుమకొండ, నవంబర్ 12: నవంబర్ 8న.. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు వేళ కోళ్లు దర్శనమిచ్చాయి. నాడు ఆ ఊరి ప్రజలు ఎగబడి అందినకాడికి కోళ్లను పట్టుకెళ్లారు. అయితే.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఓ యజమాని వాటిని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.


ఆరోజు ఏం జరిగిందంటే.?

సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు సుమారు 2వేల నాటుకోళ్లను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడికి చేరి ఆ కోళ్లను పట్టుకెళ్లారు. అనంతరం వాటిని కూరగా వండుకు తిన్నారు. దీంతో ఆరోజు ఆ ఊళ్లో పండుగ వాతావరణమే తలపించింది.! ఈ విషయం జిల్లా వ్యాప్తంగా బట్టబయలు కావడంతో ఆ ఊరి ప్రజలు లక్కీఛాన్స్ కొట్టేశారని పలువురు భావించారు.


ఇవీ చదవండి:

నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత.. భక్తుల ఆగ్రహం

Updated Date - Nov 12 , 2025 | 01:43 PM