Share News

Farmer Protests: గ్రీన్‌ ఫార్మా సిటీ భూముల సర్వే

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:40 AM

హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ కోసం గతంలో ప్రభుత్వం సేకరించిన భూములను గురువారం టీజీఐఐసీ, రెవెన్యూ

Farmer Protests: గ్రీన్‌ ఫార్మా సిటీ భూముల సర్వే

  • పట్టా భూముల జోలికి రావద్దని అధికారులతో రైతుల వాదన

  • పరిహారం ఇచ్చిన భూములే సర్వే చేస్తున్నామన్న ఆర్డీవో

యాచారం, జూలై 31(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ కోసం గతంలో ప్రభుత్వం సేకరించిన భూములను గురువారం టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది రైతులు అధికారులతో వాదనకు దిగడంతో రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. గ్రీన్‌ ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం మేడిపల్లి, నానక్‌నగర్‌, తాటిపర్తి, కుర్మిద్ద రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు 11,000 ఎకరాల పట్టా, అస్సైన్డ్‌ భూములను సేకరించింది. వీటికి సంబంధించి రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల ప్లాట్లు కూడా కేటాయించింది. ఈ భూములు ఏ సర్వే నంబర్లలో ఎంతమేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే చేపట్టారు. అయితే కొందరు రైతులు తమ పట్టాభూములు, కోర్టు వివాదంలో ఉన్న భూములను సర్వే చేస్తున్నారని భావించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ముందు వినిపించుకోలేదు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తమకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిహారంతో పాటు ప్లాట్లు ఇచ్చిన భూములను మాత్రమే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నామని, కోర్టు వివాదంలో ఉన్న భూములను, పట్టా భూములను ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయబోమని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన విరమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:40 AM