Share News

Adilabad: చదువుకు సెలవు.. పశువులకు నెలవు

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:59 AM

బడి అంటే చదువుల నిలయం. విద్యకు ఆలయం. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం. అటువంటి చోటు పాఠాలకు బదులు.. పశువులకు నెలవుగా మారితే.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు..

Adilabad: చదువుకు సెలవు.. పశువులకు నెలవు

బడి అంటే చదువుల నిలయం. విద్యకు ఆలయం. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం. అటువంటి చోటు పాఠాలకు బదులు.. పశువులకు నెలవుగా మారితే.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు.. జీవాలను కాస్తూ అక్షరాలకు దూరమైతే.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం డోల్లార గ్రామంలో ఇదే దుస్థితి నెలకొంది. ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంగా మారింది. జీవాలకు పచ్చి గడ్డి వేస్తూ.. అవి ఎండా వానకు ఇబ్బంది పడకుండా బడిలో కట్టేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ బడి మూసే ఉంది. ఈ పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయలు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామానికి చెందిన సుమారు 35 మంది చిన్నారులు విద్యకు దూరమతున్నారు. బడికి వెళ్లాల్సిన పిల్లలు.. సద్ది చేత పట్టుకుని పశువుల కాపలాకు వెళుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌)

Updated Date - Jul 08 , 2025 | 03:59 AM