Share News

Film Awards: ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ABN , Publish Date - May 30 , 2025 | 03:37 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ిసినీ పురస్కారాల సందడి మొదలైంది. 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డు’లను జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ ప్రకటించారు.

Film Awards: ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

  • ఉత్తమ నటి నివేదా థామస్‌.. ఉత్తమ చిత్రం కల్కి 2898 ఏడీ

  • 2024కుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రకటన

  • వివరాలు వెల్లడించిన జ్యూరీ చైర్‌పర్సన్‌, సీనియర్‌ నటి జయసుధ

  • తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పురస్కారాల సందడి

  • లక్కీ భాస్కర్‌ చిత్రానికి 4.. రజాకార్‌ చిత్రానికి 3 గద్దర్‌ అవార్డులు

(ఆంధ్రజ్యోతి-సినిమా డెస్క్‌): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ిసినీ పురస్కారాల సందడి మొదలైంది. 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డు’లను జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ ప్రకటించారు. సమాచార భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజుతో కలసి ఆమె అవార్డుల వివరాలు వెల్లడించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (పుష్ప-2).. ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’, ఉత్తమ ద్వితీయ చిత్రంగా ‘పొట్టేల్‌’, ఉత్తమ తృతీయ చిత్రంగా ‘లక్కీ భాస్కర్‌’ ఎంపికైనట్టు తెలిపారు. జ్యూరీ కమిటీ నిష్పక్షపాతంగా అవార్డులకు అర్హులను ఎంపిక చేసిందని దిల్‌ రాజు తెలిపారు.


జూన్‌ 14న ఈ అవార్డులను బహూకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా.. అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని జయసుధ తెలిపారు. అవార్డుల ఎంపికలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్నింటినీ జ్యూరీ కమిటీ పరిశీలించిందని వివరించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, కమిటీ ఏకాభిప్రాయంతో అవార్డులకు అర్హులను ఎంపిక చేసిందని.. కొత్త దర్శకులు, నటులతో తీసిన చాలా సినిమాలు పరిశీలనకు రావడం సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పారు.

ఇవీ అవార్డుల వివరాలు..

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ

రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్‌

మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌

చైతన్యం కలిగించే కేటగిరీలో

ఉత్తమ చిత్రం: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ బాలల చిత్రం: ‘35’ చిన్న కథ కాదు

చరిత్ర, వారసత్వంకేటగిరీలో ఉత్తమ చిత్రం: రజాకార్‌

ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్‌

ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప-2)

ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌.జె.సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్‌

(అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్‌ సిసిరోలియో (రజాకార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోషల్‌ (పుష్ప 2)

ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తు వదలరా 2)

ఉత్తమ బాలనటులు: అరుణ్‌దేవ్‌ (35 చిన్నకథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మీనన్‌ (గామి)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ కళా దర్శకుడు: అద్నితిన్‌ జిహాని చౌదరి (కల్కి)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌:

కె.చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చన రావు,

అజయ్‌ కుమార్‌ (కల్కి 2898 ఏడీ)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు

దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌), అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

సుజిత్‌,సందీప్‌ (క), ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి (రాజుయాదవ్‌)

స్పెషల్‌ జూర్యీ మెన్షన్‌: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం

‘మన సినిమా ఫస్ట్‌ రీల్‌’: రెంటాల జయదేవ


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 03:37 AM