Share News

CID: చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:36 AM

భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

CID: చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు

హైదరాబాద్‌/వేములవాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చెన్నమనేని రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరు తూ వేములవాడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గత నెల 17వ తేదీన డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. .


ఈ క్రమంలో డీజీపీ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు గత నెలలోనే రమేశ్‌పై ఐపీసీ 465, 468, 471, ఇండియన్‌ పాస్‌పోర్టు యాక్ట్‌ సెక్షన్‌ 12, ఫారినర్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 14, ఇండియన్‌ సిటిజన్‌షి్‌ప యాక్ట్‌ సెక్షన్‌ 17 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈక్రమంలో ఫిర్యాదుదారుడైన ఆదిశ్రీనివాస్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఆయనను బుధవారం సీఐడీ కార్యాలయానికి పిలిచారు

Updated Date - Apr 23 , 2025 | 04:36 AM