Share News

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..

ABN , Publish Date - May 18 , 2025 | 12:41 PM

Fire Accident In Charminar: ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే మొఘల్‌పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు.

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..
Fire Accident In Charminar

చార్మినార్‌లోని పాతబస్తీలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే మొఘల్‌పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు. భవనంలో గ్రౌండ్ + 2 అంతస్తులు ఉన్నాయని వెల్లడించారు. కింది అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తులకు వ్యాపించాయని తెలిపారు.


మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారన్నారు. మొత్తం 11 ఫైర్ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు.. 70 మంది సిబ్బంది ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటల సమయం పట్టిందని అన్నారు. అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి చిక్కుకుపోయిన వారిని రక్షించారని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. దెబ్బతిన్న ఆస్తి విలువ తెలియాల్సి ఉందన్నారు.


ఇవి కూడా చదవండి

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పీఎం, తెలుగు రాష్ట్రాల సీఎంల తీవ్ర దిగ్భ్రాంతి

Rukmini Vijayakumar: ప్రముఖ నటి కారులో చోరీ.. ఏకంగా 23 లక్షల సొత్తు దోచేశాడు..

Updated Date - May 18 , 2025 | 12:55 PM