D K Aruna: ఏటేటా తెలంగాణలో ధాన్యం దిగుబడి వృద్ధి
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:38 AM
తెలంగాణలో ఏడాదికేడాది ధాన్యం దిగుబడితోపాటు సేకరణ గణనీయంగా పెరుగుతుండటంతో గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం

ఎఫ్‌సీఐ సలహా కమిటీ చైౖర్‌పర్సన్‌గా డీకే అరుణ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏడాదికేడాది ధాన్యం దిగుబడితోపాటు సేకరణ గణనీయంగా పెరుగుతుండటంతో గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సలహా కమిటీ చైర్ పర్సన్ డీకే అరుణ చెప్పారు. బియ్యం నిల్వకు అవసరమైనచోట గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని హాకా భవన్‌లోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో గురువారం ఆమె ఎఫ్‌సీఐ సలహా కమిటీ చైర్ పర్సన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులు, అధికారులతో చర్చించిన అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ ఎఫ్‌సీఐలోని సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించి సంస్థ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు.