Share News

Jupally Krishna Rao: పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:46 AM

రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

Jupally Krishna Rao: పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి

  • ఎక్సైజ్‌ అధికారులతో మంత్రి జూపల్లి

రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దాదాపు 15 ఏళ్లుగా బదిలీలు జరగలేదు. దీంతో ఆ విషయంపై చర్చించారు. పదోన్నతులతో సంబంధం లేకుండా పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి ఆదేశించడంతో.. పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Updated Date - Jun 24 , 2025 | 03:46 AM