Share News

KCR: సావిత్రీబాయి ఫూలేకి కేసీఆర్ ఘన నివాళి

ABN , Publish Date - Jan 02 , 2025 | 09:04 PM

KCR:సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు మాజీ సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలేతోపాటు సావిత్రి బాయి ఫూలే సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

KCR: సావిత్రీబాయి ఫూలేకి కేసీఆర్ ఘన నివాళి
BRS Chief KCR

హైదరాబాద్, జనవరి 02: సకల రంగాల్లో బహుజనులను కట్టడి చేసి.. సామాజిక సంప్రదాయ నిర్భంధాలను బద్దలుకొట్టి.. బడుగుల అభ్యున్నతి కోసం.. స్త్రీ విద్య కోసం.. తన జీవితాన్ని దార పోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభివర్ణించారు. చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు కేసీఆర్ గురువారం ఘనంగా నివాళులర్పించారు.

దేశ సామాజిక రంగంలో సంస్కరణల దిశగా వారందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకొన్నారు. పదేండ్ల తెలంగాణ సామజిక ప్రగతి ప్రస్థానంలో మహాత్మా ఫూలే దంపతుల స్ఫూర్తి ఇమిడి ఉన్నదన్నారు. మహిళా సాధికారత కోసం.. ఆడబిడ్డల విద్య కోసం.. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేసిందని వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా ఫూలే దంపతులకు ఘన నివాళి అర్పించిన వారమవుతామని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక కృషి, స్త్రీ జాతి ఔన్నత్యం కోసం, అణచి వేయబడిన కులాల స్వేచ్ఛ కోసం మహాత్మా జ్యోతిరావు సావిత్రి బాయి ఫూలే దంపతుల త్యాగాలను వివరించారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా, మెజార్టీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి, వారి హక్కులు కాపాడడానికి, త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో మహాత్మా ఫూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని ఆయన పేర్కొన్నారు.


సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గత పదేండ్లలో.. అనతికాలంలో కుదురుకున్నదని ఆయన గుర్తు చేశారు. మహాత్మా ఫూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బిఆర్ఎస్ కార్యాచరణ నేడు సత్ఫలితాలను అందిస్తున్నదని వివరించారు.

Also Read: మార్కెట్‌లోకి కొత్త వాచ్.. ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాకే

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు

Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్


దళిత బహుజన వర్గాలకు పట్టుకోమ్మలైన పల్లె తెలంగాణ.. నేడు ప్రగతి పథంలో పయనిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందన్నారు. గురుకుల విద్యతో సహా, బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో, విద్యా రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రీ బాయి ఫూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉన్నాయన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలను ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలను స్థాపించమని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: ఆర్టీసీ ఛార్జీలు పెంపు.. జనవరి 5 నుంచి అమలు

Also Read: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

Also Read: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్


మహిళా సాధికారత కోసం నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాలలో నిత్య చైతన్యాన్ని నింపడం ద్వారా మాత్రమే సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులకు మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.

Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ

For Telangana News And Telugu News

Updated Date - Jan 02 , 2025 | 09:04 PM