Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:18 PM
Bhoodan Land Scam: ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డి-నోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకు విక్రయించారు.

భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో హైదరాబాద్‌లోని ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయడంపై విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఆ ప్రకటనలో.. ‘ నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడంపై ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులపై .. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నాం.
మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఉన్న భూములు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించాము. ఖాదర్ ఉన్నిసా పూర్వీకుల ఆస్తిగా చెప్పి రెవెన్యూ రికార్డులను మోసపూరితంగా మార్చేశారు. కొంత మంది దళారులతో కలిసి భూమిని వివిధ సంస్థలకు విక్రయించారు. ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డి-నోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకు విక్రయించారు.
ఖాదేరునిస్సా, మహమ్మద్.. మునావర్ ఖాన్, మహమ్మద్.. లతీఫ్ షర్ఫాన్, మహమ్మద్.. అక్తర్ షర్ఫాన్, మహమ్మద్.. సుకూర్‌లు ప్రభుత్వ భూమిని మోసపూరితంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన పత్రాలు సీజ్ చేశాము. 23 లక్షల రూపాయల నగదు, విదేశీ కరెన్సీ 12000 దిర్హామ్ సీజ్ చేశాము. మహమ్మద్ ఫామ్‌హౌస్లో 45 కార్లు స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Princess Itka Klet: పోయిన 22 లక్షల రింగ్ తెచ్చిచ్చారు..5 లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు