Share News

Konda Surekha: దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:06 AM

రాష్ట్ర దేవాదాయశాఖలో ఈ-ఆఫీసు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ శాఖ మంత్రి కొండా సురేఖ.. దేవాదాయశాఖ

Konda Surekha: దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

  • లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సురేఖ

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవాదాయశాఖలో ఈ-ఆఫీసు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ శాఖ మంత్రి కొండా సురేఖ.. దేవాదాయశాఖ కమిషనరేట్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభిస్తూ.. తమశాఖలో చేపట్టిన సంస్కరణలు గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. ఈ-ఆఫీస్‌ ద్వారా త్వరితగతిన ఫైళ్లు క్లియర్‌ కావడంతో అవి దొంగతనానికి గురి కావడం గానీ, అగ్ని ప్రమాదంలో కాలి పోవడం గానీ, మాయం కావడం గానీ ఉండదన్నారు. ఈ-ఆఫీసు ప్రారంభోత్సవం ద్వారా ఒక కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశ పెడతామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు గురువారం ఆమెను కలిసి ఆశీర్వదించారు. అర్చకులకు పదోన్నతుల కల్పనలో జాప్యం జరుగుతున్నదని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అర్చక ఆగమ పరీక్షలు నిర్వహిస్తామని అర్చక ఉద్యోగ జేఏసీ ప్రతినిధులకు మంత్రి సురేఖ హామీ ఇచ్చారు.

Updated Date - Aug 01 , 2025 | 05:06 AM