Traffic Violation: ద్విచక్ర వాహనంపై 233 ట్రాఫిక్ చలాన్లు!
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:55 AM
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ద్వారా జరిమానాలకు గురైన ఓ వాహనదారుడు వాటిని చెల్లించకుండా రోడ్లపై తిరుగుతూ శనివారం కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.

వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కాజీపేట ట్రాఫిక్ పోలీసులు
వరంగల్ క్రైం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ద్వారా జరిమానాలకు గురైన ఓ వాహనదారుడు వాటిని చెల్లించకుండా రోడ్లపై తిరుగుతూ శనివారం కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట చౌరస్తాలో శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన హనుమకొండకు చెందిన అస్లం అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు.
వాటి జరిమానా రూ.45,350 చెల్లించలేదని నిర్ధారణ అయుందన్నారు. పెండింగ్ చలాన్ల రశీదును సదరు వాహనదారుడికి అందజేసి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News