Suryapet: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:11 AM
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మీక్యాతండాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంగోతు నాగు (30) తనకున్న 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు.

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో ఘటన
పెన్‌పహాడ్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మీక్యాతండాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంగోతు నాగు (30) తనకున్న 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు. సాగు కోసం చేసిన 2 లక్షల 20 వేల రూపాయల అప్పు తీర్చలేననే మనస్తాపంతో ఈ నెల 21వ తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు.
విషయం తెలియడంతో తల్లి మాజా అతడిని సూర్యాపేటలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నాగు మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపారు.