Share News

CPIM: ఆదివాసీల నిర్మూలనకే ఆపరేషన్‌ కగార్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:38 AM

సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ను ఆదివాసీల నిర్మూలనకే చేపట్టిందని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు

CPIM: ఆదివాసీల నిర్మూలనకే ఆపరేషన్‌ కగార్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకే కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టిందని, ఆదివాసీలు వెళ్లిపోయాక ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర ఇదని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. వెంటనే ఆపరేషన్‌ ఆపేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. చర్చిద్దామని మావోయిస్టులు అడుగుతుంటే.. వారిని పిలవకుండా తుద ముట్టించేదాకా వదిలిపెట్టమనడం దుర్మార్గమని విమర్శించారు.

Updated Date - Apr 29 , 2025 | 03:38 AM