Mallu Ravi: తెలంగాణలో సామాజిక బాధ్యతతో పాలన
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:05 AM
తెలంగాణలో సామాజిక బాధ్యతతో పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుందని ఆరోపించారు.

ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ సర్కారు అద్భుతాలు : మల్లు రవి
క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సామాజిక బాధ్యతతో పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుందని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ 11వ అవతరణ దినోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.
అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న మల్లు రవి.. గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో పంచాయితీ అంతా ఓ డ్రామా అంటూ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం కొట్టిపారేశారు.