Share News

Cell Phone Blasted: జేబులో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:46 PM

Cell Phone Blasted: శ్రీనివాస్ సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది. దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Cell Phone Blasted: జేబులో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..
Cell Phone Blasted

ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా, ఓ వ్యక్తి ప్యాంట్స్ జేబులో సెల్ ఫోన్ పేలింది. సెల్ ఫోన్ పేలుడు కారణంగా ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతడు గత కొన్ని సంవత్సరాలుగా వీవో కంపెనీకి చెందిన ఫోన్ వాడుతున్నాడు.


శుక్రవారం సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది. దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి చికిత్స చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వర్ష భీభత్సం.. 63 మంది మృతి.. డజన్ల మంది గల్లంతు..

పేక మేడలా కూలిన భవంతి.. 7 సెకన్లలో అంతా అస్సాం..

Updated Date - Jul 04 , 2025 | 01:57 PM