Bandi Sanjay: పాక్‌కు వణుకు పుట్టేలా బదులిస్తాం
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:18 AM
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పహల్‌గామ్ ఘటన అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని వెల్లడించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పహల్‌గామ్ ఘటన అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని వెల్లడించారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’లో బండి సంజయ్‌తో పాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. రోజ్ గార్ మేళా ద్వారా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని తెలిపారు. 14 మేళాలను నిర్వహించి 9.25లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. శనివారం 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేశామని ఆరోపించారు. ఈసందర్భంగా 700 మందికి నియామక పత్రాలను అందించారు.
దోపిడీ కోసమే కాళేశ్వరం: అర్వింద్
రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడానికే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పెట్టుకున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే ప్రాజెక్టులో ఎంత దోపిడీ జరిగిందో వెల్లడవుతుందని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు ఆయన కుమారుడు, కూతురు నుంచే ప్రమాదం ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News