Balakrishna: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:15 AM
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా సంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా..

బసవతారకం ఆసుపత్రి రజతోత్సవాలకు ఆహ్వానం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా సంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి వేడుకల్లో పాల్గొనవలసిందిగా కోరారు. వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.