Share News

Allu Aravind: తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు.. పవన్ కల్యాణ్ పేషీ నోట్‌పై అల్లు అరవింద్..

ABN , Publish Date - May 25 , 2025 | 06:12 PM

Allu Aravind: తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉప ముఖ్యమంత్రి పవన్ పేషీ విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

Allu Aravind: తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు.. పవన్ కల్యాణ్ పేషీ నోట్‌పై అల్లు అరవింద్..
Allu Aravind

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం తెలుగు చిత్ర పరిశ్రమపై శనివారం సంచలన ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉప ముఖ్యమంత్రి పవన్ పేషీ విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.


ఆయన మాట్లాడుతూ.. ‘ ఆ నలుగురు అంటూ వార్తలు రాయడం సరికాదు. ఆ నలుగురి నుంచి నేను బయటకు వచ్చేశా. నా దగ్గర చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర కేవలం 15లోపు థియేటర్లే ఉన్నాయి. మిగిలిన థియేటర్లు వదిలేశా. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్‌ కూడా లేదు. థియేటర్లకు సంబంధించి 3 మీటింగ్స్‌కు నేను వెళ్లలేదు. ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దు’ అని అన్నారు.


ఇండస్ట్రీకి హెల్ప్‌ చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌

‘ పవన్‌ సినిమా వస్తుండగా థియేటర్ల మూత అనేది దుస్సాహసం. గతంలో కలిసినప్పుడు సీఎంను కలవాలని పవన్‌ చెప్పారు. సినిమా రంగాన్ని ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడటం సరికాదు. గత సీఎంను మా సినిమా పెద్దలు ఎందుకు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక సీఎంను ఎందుకు కలవలేదు. కొంతమంది మాకు సీఎం, డిప్యూటీ సీఎం తెలుసు అన్నారే తప్ప.. ఇండస్ట్రీ నుంచి ఏ సంఘం వెళ్లి కలవలేదు.


ఇండస్ట్రీకి హెల్ప్‌ చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. కష్టం వచ్చినప్పుడు వెళ్లి కలవడం కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లి కలవడం ఆనవాయితీ. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వ సహకారం అవసరం. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. పవన్‌ పేషీ లేఖ సమర్థనీయం. సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ మధ్య.. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం కావాలనేది డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ ఆలోచించుకోవాలి.. ఏమీ మాట్లాడకుండా థియేటర్లు మూస్తామంటే ఎలా. సమస్యపై చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్‌ కృషి చేస్తున్నారు. థియేటర్లు మూస్తామని చెప్పి పవన్‌ను బెదిరిస్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Allu Aravind: తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు.. పవన్ కల్యాణ్ పేషీ నోట్‌పై అల్లు అరవింద్..

Female HR: రెజ్యూమ్ పంపమంటే.. ప్రేమ పైత్యం చూపించిన పోకిరీలు

Updated Date - May 25 , 2025 | 06:27 PM