Share News

Saudi bus accident: 46 మందిలో ఒక్కడే బతికాడు.. సౌదీ బస్ ప్రమాదంలో తప్పించుకున్న వ్యక్తి ఎవరంటే..

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:38 PM

మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 45 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి అబ్దుల్ షోయబ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

Saudi bus accident: 46 మందిలో ఒక్కడే బతికాడు.. సౌదీ బస్ ప్రమాదంలో తప్పించుకున్న వ్యక్తి ఎవరంటే..
lone survivor Saudi accident

సౌదీ అరేబియాలోని మదీనాకు సమీపంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 45 మంది మరణించారు (Indian Umrah pilgrims).


ఈ ఘోర ప్రమాదం నుంచి అబ్దుల్ షోయబ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షోయబ్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. గాయాల పాలైన షోయబ్‌ను హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం బయటకు రాలేదు (lone survivor Saudi accident). కాగా, ఈ ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ చనిపోయినట్టు తెలుస్తోంది.


హైదరాబాద్‌ నుంచి మొత్తం 54 మంది నవంబర్ 9వ తేదీన జెడ్డాకు బయల్దేరి వెళ్లారు (Saudi Arabia tragedy). నవంబర్ 23వ తేదీ వరకు వీరి టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు ఆదివారం మక్కా నుంచి మదీనాకు కారులో వెళ్లిపోయారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. దీంతో 46 మంది బస్సులో మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 45 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.


ఇవి కూడా చదవండి..

మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 01:52 PM