ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటాం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:28 PM
పోలీసుశాఖ ప్రజారక్షణతో పాటు ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ ప్రారం భించారు.

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖ ప్రజారక్షణతో పాటు ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మజ్జిగ కేంద్రంలో ప్రతి రోజు సుమారు 500 మంది వరకు పంపిణీ చేస్తా మన్నారు. వేసవికాలంలో ప్రజల దప్పిక తీర్చేందుకు జిల్లాలోని ప్రతీమండల కేంద్రంలో ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసు అధికా రులతో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్, ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ రవీందర్, సత్యనారా యణ, ఎస్సైలు అంజన్న, ప్రశాంత్, తదితరు లు పాల్గొన్నారు.
మొబైల్ ఫోన్ల అందజేత..
ఎవరైనా వ్యక్తులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా మిస్ అయిన వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌లో లేదా సీఈఐ ఆర్ వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌లు పోగొట్టుకున్న 50 మంది బాధితులకు బుధవారం తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్‌లు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్ల ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉంటూ వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎనిమిది, కాగజ్‌నగర్ టౌన్‌లో 10, కెరమెరిలో మూడు, వాంకిడి మూడు, రెబ్బెనలో ఎనిమిది, కౌటాలలో ఏడు, కాగజ్‌నగర్ రూరల్‌లో మూడు మొత్తం 50 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఎస్సైలు సౌమ్య, తేజస్విని, ఐటీ కోర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.