వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:41 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్ర మంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధిం చాల ని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటా రు

కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్ర మంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధిం చాల ని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ గీతకార్మికుల సంక్షేమంలో భాగంగా 400తాటి మొక్కలు నాట డంతో పాటు గీత కార్మికులకు మొక్క లు పంపిణీ చేశామన్నారు. ప్రతీఒక్కరు మొక్క లునాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రజలు తమఇళ్లలో మొక్కలు నాటాల న్నారు. అనంతరం పొక్కూరు జిల్లా పరిషత్ పాఠశా లలో 200మొక్కలు నాటారు. పాఠశాల పరిధిలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను కలెక్టర్ ప్రాంర భించారు. అనంతరం వంటశాలను, ఆహా రనాణ్యతను, హాజరుపట్టిక, పరిసరాలను పరిశీ లించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్య మైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి పఠనా సామ ర్ధ్యాలను పరీక్షించారు. గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. పల్లె దవాఖాన, ఆయుష్‌భారత్ ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి మందుల నిల్వలు, రిజిస్టర్‌లు, పరిస రాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది అం దుబాటులో ఉండాలని సూచించారు. అనం త రం అంగ్రాజ్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని పరిశీలించి వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశా రు. ఆరోగ్య కేంద్రం పరిధి లోని గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించా లని, సమయానుసారంగా చేసుకోవాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన మందులపై అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లల వ్యాక్సిన్‌లు అందుబా టులో ఉన్నాయని, వ్యాక్సి న్‌ల కోసం ఇతర ప్రాంతాల కు వెళ్లనవసరం లేదని ప్రజలు వినియోగించుకోవా లని తెలిపారు. చెన్నూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్‌లు, రికార్డుల ను పరిశీలించారు. చెన్నూరు మున్సిపల్ పరిధి లో కొనసాగుతున్న అమృత్ 2.0పథకం పనుల ను పరిశీలించి పనులను వేగవం తం చేయా లని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, ఎంపీడీవో మోహన్, తహసీ ల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ ముర కళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.