రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:43 PM
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించతలపెట్టి బీఅర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
జైనూర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించతలపెట్టి బీఅర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. మండలంలోని దుబ్బగూడలో కార్యరక్తలతో కలిసి చలో వరంగల్ సభ పోస్టర్లను ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఅర్ పాలన లో అన్నివర్గాలకు సముచిత న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం పేద బడుగు వర్గాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఅర్‌ఎస్ పాలన లో నియోజకవర్గంలో అధిక నిధులు మంజురు చేసి తాగునీరు, విద్యుత్, వైద్యం వంటి మౌలిక సదుపా యాలు కల్పించామన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు వరంగల్ సభకు తరలివెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామని ఆ స్థాయిలో గట్టి ప్రయత్రాలు చేస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో బీఅర్‌ఎస్ జరతోత్సవం సభ పట్ల ప్రజలకు ఆవగాహన కల్పించి వారిని ఎక్కువ సంఖ్యలో సభకు తీసుకోచ్చేల కార్యకర్తలు కృషి చేయా లని సూచించారు. అనంతరం జైనూరు మండల నూతన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాబ్లే బాబా సాహేబ్‌కు శాలువ కప్పి సన్మానించారు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఇంతీయాజ్ లాల, మాజీ సర్పంచులు మడావి భీంరావ్, కుంర శాంరావ్, మేస్రాం పార్వతీబాయి, మేస్రాం నాగోరావ్, అంబేద్కర్ సంఘం నాయకులు కాంబ్లే అన్నారావ్, వాగ్మారె శేషరావ్, సోనకాంబ్లే సిద్దు తదితరులు పాల్గోన్నారు.