Share News

ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:21 PM

ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు.

ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలి
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

కాగజ్‌నగర్‌/బెల్లంపల్లి/ఆసిఫాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం తెలంగాణ పౌర స్పందన వేదిక ప్రచార జాతాలో భాగంగా కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో ప్రీ పైమరీ తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. బడీఈడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో పాఠశాలన్ని రీ ఆర్గనైజ్‌ చేయాలన్నారు. ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసిన ఎయిడెడ్‌ పాఠశాలల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక నాయకులు మంగ, నాగమణి, ధనమూర్తి, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.రాజకమలాకర్‌ రెడ్డి, నాయకులు మహేష్‌, సురేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముంజం ఆనంద్‌ కుమార్‌, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కోట శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయికృష్ణ, దిపక్‌, టీఎస్‌యుటీఎఫ్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:21 PM