సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:30 PM
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

- ఎమ్మెల్సీ దండె విఠల్
సిర్పూర్(టి), జూలై 28(ఆంధ్రజ్యోతి): పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలను దశల వారీగా నెరవేరుస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదనిని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ వెంకటేష్‌దోత్రే మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సన్న బియ్యం అమ్ముకుంటే వారి రేషన్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ షాపు డీలర్లు సైతం సన్న బియ్యం అక్రమాలకు పాల్పడితే వారిపై వేటు వేస్తామని తెలిపారు. అనంతరం నూతనంగా మంజూరు అయిన 281 రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో గిరీష్, నాయకులు సిడాం గణపతి, తదితరులు పాల్గొన్నారు.