సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:11 PM
వచ్చే నెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను అంతా కలిసి విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పిలుపునిచ్చారు. సోమవారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు
కాగజ్‌నగర్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను అంతా కలిసి విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పిలుపునిచ్చారు. సోమవారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న 44 చట్టాలను యఽథావిఽధిగా కొనసాగించాలన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. నాలుగు బార్ కోడ్ విధానాలను వెంటనే రద్దు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, నాయకులు గౌస్, సంజీవ్, రాజు, సమ్మయ్య, మురళి, నగేష్ పాల్గొన్నారు.
- కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మె మే 20న నిర్వహిస్తున్నట్టు, ఇందుకు అంతా పాల్గొనాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఇఫ్టూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చాంద్ పాషా, కార్మిక సంఘాల నాయకులు సత్యనారాయణ, సుధాకర్,కృష్ణమాచారి, తిరుపతి, పోచన్న, భీంరావు, కార్మికులు పాల్గొన్నారు.