విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:24 PM
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సీఐ సంతోష్‌కమార్ సూచించారు. చింతలమానేపల్లి మండలంలోని బాబాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్పీ కాంతిలాల్, ఏఎస్పీ చిత్తరం జన్ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో ‘బాలికల భద్రత, విద్య వల్ల జీవిత విజయం’ అనే అంశంపై అవగాహన కల్పించారు.

- సీఐ సంతోష్‌కమార్
చింతలమానేపల్లి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సీఐ సంతోష్‌కమార్ సూచించారు. చింతలమానేపల్లి మండలంలోని బాబాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్పీ కాంతిలాల్, ఏఎస్పీ చిత్తరం జన్ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో ‘బాలికల భద్రత, విద్య వల్ల జీవిత విజయం’ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్‌కమార్ మాట్లాడు తూ విద్యార్థులు మంచి నడవడిక కలిగి ఉం డాలని, క్రమశిక్షణతో మెలగాలని, శ్రద్ధాసక్తుల తో విద్యను అభ్యసించాలని సూచించారు. బాలికలకు ఇతర కారణాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పాఠశాల ఉపాధ్యా యులకు లేదా తల్లిదండ్రులకు తెలిపాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఉపాధ్యాయులు, షీ టీం సభ్యులు స్వప్న, రజిని, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరిలో...
కెరమెరి (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోడి కేజీబీవీలో షీ టీం ఆధ్వర్యంలో మహిళ ల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా షీ టీం ఇన్‌చార్జి సునీత విద్యార్థినులకు భద్రత చట్టాలు, ఆపద సమయంలో ఎలా స్పందించాలి, డయల్ 100, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఈవ్‌టిజింగ్, సైబర్ క్రైం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే షీ టీం 8712670564(ఆసిఫాబాద్), 8712670565 (కా గజ్‌నగర్) సంప్రదించాలని సూచించారు.