Share News

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:09 PM

: వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అదనపు కల్టెర్‌ దీపక్‌ తివారి అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలసి అర్జీదారుల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

- అదనపు కల్టెర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అదనపు కల్టెర్‌ దీపక్‌ తివారి అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలసి అర్జీదారుల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.

ఆసిఫాబాద్‌ పట్టణంలోని రవిచంద్ర కాలనీకి చెంది న పర్చకి శారద తాను ఎంబీఏ చదివి వాహన ప్రమా దంలో గాయాలపాలై ఇంటి వద్దన ఉంటున్నానని, జిల్లా కేంద్రంలోని ఏదైనా కార్యాలయంలో ఉపాధి అవకాశం కల్పించాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లికి చెందిన కోటేష్‌ తాను తెలంగాణ మైనార్టీ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగానికి ఒప్పంద పద్ధతిన దరఖాస్తు చేసుకున్నానని మెరిట్‌లో ఉన్నా ఉద్యోగం రాలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన పులి బాపు, రెబ్బెన మం డలానికి చెందిన సుమన్‌బాయి వృద్ధాప్య పింఛన్‌ ఇ ప్పించాలని, కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన మీరాబాయి వింతంతు పింఛన్‌ ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

ఆసిఫాబా ద్‌ మండలం చిర్రకుంటకు చెందిన లచ్చు తనకు గ్రామ శివారులో ఉన్న పట్టా భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించి పట్టా పాసుపుస్తకం మంజూరు చే యాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండల కేంద్రానికి చెందిన అశోక్‌ తమ తండ్రి పేరిట గల భూమిని కౌటాల మినీ స్టేడియం కోసం తీసుకున్నారని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని న్యాయం చేయాలని కోరు తూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరి ష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 11:09 PM