రోస్టర్ విధానంతో మాలలకు తీరని అన్యాయం
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:43 PM
ఏకపక్ష రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుం దని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అద్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో జరిగిన మాల మహానాడు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్
లక్షెట్టిపేట, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఏకపక్ష రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుం దని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అద్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో జరిగిన మాల మహానాడు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకణ రోస్టర్ జీవో 99వలన మాలజాతి నిర్వీర్యం అవుతుం దని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీట్‌లో పదోన్న తులు, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్‌లో రోస్టర్ విదా నాన్ని ఆపేసి జీవో 99ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దీని వలన విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. రోస్టర్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని లేదంటే ఆగస్టు నెలలో చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తొగరు సుధా కర్, పాల్తెపు శంకర్, పలిగిరి కనకరాజు, బందెల బెంజి మెన్, జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసి డెంట్ నక్క శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గరిసె రవీందర్, పొల్లు శ్రీనివాస్, బొల్లం రాంకుమార్, ఉసిల్ల విజయ్, దాసరి రాములు, బండ రవి, చంద్రయ్య, ప్రేంసాగర్ తదితరులు పాల్గొన్నారు.