Share News

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందించాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:22 PM

అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం రేషన్‌కార్డులు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందించాలి
వాంకిడిలో రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

- ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

వాంకిడి/రెబ్బెన ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం రేషన్‌కార్డులు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం వాంకిడి మండల కేంద్రంలో, రెబ్బెన రైతు వేదికలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి కొత్తగా మంజూరైన రేషన్‌కార్డు లను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని అమా యక ప్రజలకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకో వడం తెలియక అనేక మంది నిరుపేదలు నేటికీ దరఖాస్తులు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీఒక్కరికి రేషన్‌కా ర్డులు అందించేలా అధికారులు చూడాలన్నారు. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యం అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంక్షేమ పథకా నికి రేషన్‌కార్డులు తప్పనిసరని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలన్నా రు. అనంతరం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ వాంకిడి మండలంలో మొత్తం 1,892 రేషన్‌కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. కార్డులు రానివారు ఆందోళన చేందవద్దని దరఖా స్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి రేషన్‌ కార్డులు అందిస్తామని దీమా కల్పించారు. ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం అందిం స్తోందని ప్రజలు సన్న బియ్యంను విక్రయించకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంట య్య, తహసీల్దార్‌ కవిత, డీటీ రాంలాల్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి

తిర్యాణి(ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డులను లబ్ధిదారు లు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కల్టెర్‌ డేవిడ్‌ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను శనివారం పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 508 నూతనకార్డులు మంజూరుకాగా, 390 మందికి మార్పులు, చేర్పులు చేశామని తెలిపారు. కార్డుల ద్వారా అర్హులైన వారందరికి సన్న బియ్యం అందజే స్తామన్నారు. రేషన్‌ బియ్యం అమ్మితే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. గ్రామాల్లో పని చేస్తున్న రేషన్‌ సేల్స్‌మెన్‌, డీలర్లు, లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ మాట్లాడు తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజాసమస్యలు పరిష్కారమ వుతాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డులు ఎరగని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. కార్డులు మంజూరు అయిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్య క్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌, డీఎఫ్‌వో జాదేవ్‌, తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌, డీటీ వంశీకృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:22 PM