వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:45 PM
వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అఽధికారి డాక్టర్ హరీష్‌రాజ్ సూచించారు.

జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్
లక్షెట్టిపేట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అఽధికారి డాక్టర్ హరీష్‌రాజ్ సూచించారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట పాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీ పరిధిలోని సూపర్‌వైజర్‌లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సూపర్‌వైజర్లు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తున్న విషయా లను వెంట వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. సూపర్‌వైజర్‌లు ఆరోగ్య ఉప కేంద్రాల్లో, ఆయుస్మాన్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని తమ పరిధిలోని గర్భిణుల ఈటీడి వివరాలు అందుబాటులో ఉంచుకోవాల ని సూచించారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో వెంట జిల్లా మాస్ మీడియా అఽధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.