సైబర్ క్రైం ముఠా పట్టివేత
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:37 PM
మంచిర్యాల జిల్లా జన్నా రంలో భారీ సైబర్ క్రైంకు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ వివరాలు వెల్లడించారు.

- 250 సిమ్‌కార్డులతో ప్రత్యేక డివైజ్
- ఆంధ్రప్రదేశ్ నుంచి సిమ్‌ల కొనుగోలు
- వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జన్నా రంలో భారీ సైబర్ క్రైంకు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. మంచి ర్యాల, రామగుండం పోలీసు కమిషనర్, టీజీసీఎస్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ రామగుండం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెంట ర్‌ను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్‌కు చెందిన యాండ్రపు కామేశ్, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాపు బాపయ్య, బాపు మధూకర్, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొట్ల రాజేశ్, ఆంధ్రప్రదేశ్‌కు వేదాంతపూర గ్రామానికి చెందిన సాయిక్రిష్ణ అలియాస్ జాక్ కలిసి మంచిర్యాల జిల్లా జన్నారంలో ఒక ప్రత్యేక డివైజ్ ద్వారా 250 సిమ్‌లతో ప్రత్యేక సెటప్‌ను బోడ ప్రభాకర్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. 45 రోజుల నుంచి రోజుకు 12వేల మందికి చొప్పున కాల్స్ చేస్తూ సైబర్ క్రైంకు పాల్పడ్డారు. ఈ సిమ్‌లను ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాకు చెందిన ఓ వక్తి వద్ద నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. జాక్ అనే వ్యక్తి దీనిలో ప్రదాన నిందితుడు. కాంబోడియాలో ఉంటున్న జాక్ ఆంరఽధప్రదేశ్‌కు చెందిన కామేశ్‌తో పరిచయం చేసుకొన్నారు. సైబర్ క్రైం కోసం ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రత్యేక సెటప్‌లో సుమారు 260 సిమ్‌కార్డులు, యుఎస్‌బీ కేబుల్, డీలింగ్ పోర్టర్‌లు ఒకే సమయంలో 200 సిమ్‌లను ఆపరేటింగ్ చేసే డివైజ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనినుంచి పలువురికి కాల్ చేస్తూ సైబర్ క్రైంకు పాల్పడ్డారు. పూర్తి దర్యాప్తు అనంతరం సైబర్‌క్రైంకు ఎంత మంది బాధితులు ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. వారి అకౌంట్లు పూర్తి దర్యాప్తు అనంతరం ఎంత మేరకు మోసం జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామన్నారు. ఒకే టవర్ నుంచి వేల కాల్స్ వెళ్లడం వల్ల టెలీకమ్యూనికేషన్ అధికారులు రామగుండం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ నిర్వహించామన్నారు. ప్రధాన నిందితుడు జాక్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆపరే షన్‌లో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణారెడ్డి, సీఐ రమణమూర్తి, టెలీకమ్యూనికే షన్ డైరెక్టర్ జనరల్ అనురాగ్, సిబ్బంది పాల్గొన్నారు.