కేకే 5 గని సమీపంలో బుంగ
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:36 PM
మందమర్రి ఏరియాలోని కేకే 5 గని సమీపంలోని మంకీ ఫుడ్ కోర్టు వద్ద బుధవారం పెద్ద బుంగ డింది.

-పూడ్చివేత చర్యలు చేపట్టిన అధికారులు
మందమర్రిటౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మందమర్రి ఏరియాలోని కేకే 5 గని సమీపంలోని మంకీ ఫుడ్ కోర్టు వద్ద బుధవారం పెద్ద బుంగ డింది. గతంలో 15 సంవత్సరాల క్రితం మూసి వేసిన కేకే 5ఏ గనికి సంబంధించిన ఎయిర్‌షాప్ట్‌గా బుంగ పడిన ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. అక్కడ పది మీటర్ల లోతు బుంగ పడింది. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు పూడ్చివేత చర్యలు చేపట్టారు. ఎయిర్ షాప్టు కింద కేకే 5 గనికి సంబంధించి బొగ్గు పిల్లర్ ఉండడంతో దాన్ని తీయడం వల్ల బుంగ పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు మూసివేసిన కేకే 5ఏ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ కేకే 5 గనిలో బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారు. ఈ ఎయిర్ షాప్టు ఐదున్నర మీటర్ల వెడల్పు, 66 మీటర్ల లోతు ఉండేదని తెలుస్తుంది. ఏర్పడిన బుంగ వల్ల ప్రమాదం లేనప్పటికి బుంగను అధికారులు పూడుస్తున్నారు.