Share News

తల్లిపాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:27 PM

తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ పెంటుబాయి అన్నారు.

తల్లిపాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
కొండపల్లిలో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కళావతి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ పెంటుబాయి అన్నారు. తల్లిపాల వారోత్సవా ల్లో భాగంగా శనివారం న్యూరాజంపేటలోని అంగన్‌ వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపా లు తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ గా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కీర్తి, అంగన్‌వాడీ టీచర్‌ వనిత, సునీత పాల్గొన్నారు.

రెబ్బెన (ఆంధ్రజ్యోతి): ముర్రుపాలతో బిడ్డకు సురక్షగా ఉంటుందని ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ కె కళావతి తెలిపారు. శనివారం కొండపల్లిలో ఏర్పా టు చేసిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. ముర్రుపాలతో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది మమత, పద్మ, రాజేశ్వరి సంతోషి, సుజాత, తారా తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌ (ఆంధ్రజ్యోతి): అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించడం శ్రేయస్కరమని జైనూర్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో ఇందిర అన్నారు. మండలంలోని గౌరి అంగన్‌ వాడీ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె పాల్గొని మా ట్లాడారు. అంగన్‌వాడీలు బి విమల, సురేఖ, సూపర్‌ వైజర్‌ సోంబాయి తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:27 PM