రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:29 PM
రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి మండలంలోని సండ్రోన్‌పల్లి, కాసిపేట మండల కేంద్రం లోని రైతు వేదికల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రిరూరల్/కాసిపేట, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యో తి): రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి మండలంలోని సండ్రోన్‌పల్లి, కాసిపేట మండల కేంద్రం లోని రైతు వేదికల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రతి రైతు భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ చట్టం వల్ల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నా రు. అదే విధంగా రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ చేసే ముందు భూముల వివరాలు పూర్తిస్ధాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు కూడా పరిష్కారమవుతా యన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు వ్యవ స్థ ఉందని, భూదార్‌కార్డుల జారీ, ఇంటి స్థలాలు, ఆబాది, రైతులకు ఉచిత న్యాయ సహాయం ఈ చట్టం లో పొందుపర్చారన్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మోసపూరితంగా నమోదై ఉంటే వాటిని రద్దు చేస్తామ న్నారు. ఈ నెల 30 వరకు అన్ని మండలాల్లో అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాసిపేటలో జరిగిన సదస్సులో ఈ సదస్సులో సభావేదికపైకి కాంగ్రెస్ కార్యకర్తలను ఆహ్వానించడంపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలను పిలువడం రాజ్యాంగ విరుద్దమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణి గింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరిక్రిష్ణ, ఉద్యానవన శాఖ అధికారి అనిత, మందమర్రి, కాసిపేట తహసీల్దార్లు స తీష్‌కుమార్, భోజన్న, మున్సిపల్ కమిషనర్ తుంగపిం డి రాజలింగు, ఎంపీడీవో రాజేశ్వర్, వ్యవసాయాదికారి కిరణ్మయి, ఏఈవోలు తిరుపతి, కనకరాజు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
మందమర్రిరూరల్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని సారంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు కేంద్రాల వద్ద నీడ, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ప్రభుత్వం అందిస్తుదన్నారు. నాణ్యమైన వడ్లను కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అనంతరం వరికోతలను పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, తహసీల్దార్ సతీష్ కుమార్, ఆర్‌ఐ గణపతి, రైతులు పాల్గొన్నారు.