Share News

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:34 PM

వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ సూచించారు. బుధవారం మండలంలోని ఇందారం ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రంను సందర్శించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలి
ఇందారంలోని ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

- డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

జైపూర్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ సూచించారు. బుధవారం మండలంలోని ఇందారం ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రంను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. రోజూ ఉప కేంద్రాల పరిధిలో ఓపీ సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, రోజువారీగా గ్రామాల్లో ఓపీ సేవలందించాలన్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైద్య సేవలందించడమే కాకుండా రిజిష్టర్‌లు, మందుల నిల్వలు, రోజువారీ ఓపీ రిజిష్టర్లు, శిశు సంరక్షణ నమోదు, టీకాల రిజిష్టర్లను నిర్వహించాలని సూచించారు. 102 అంబులెన్స్‌ ద్వారా గర్భిణులను తరలించి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కుందారం వైద్యాధికారి డాక్టర్‌ శ్రావ్య, జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్‌, సూపర్‌వైజర్‌ జ్యోతి, కృష్ణవేణి, పద్మ, కార్యదర్శి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట: గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌ సూచించారు. బుధవారం ఆయన మండలంలో మామిడిగూటలో పర్యటించి స్థానికులు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. మామిడిగూడెకు చెందిన ఆరేళ్ల బాలుడికి డెంగ్యూ లక్షణాలు బయటపడ్డాయి. ఆయన బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని డెంగ్యూ నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామాల్లో జ్వరపీడులను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కాసిపేట మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీదివ్య, సిహెచ్‌వో వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ల సరోజ, యశోధ, ల్యాబ్‌ టెక్నిషియన్‌ గోపి, హెల్త్‌ అసిస్టెంట్‌ నారాయణ, ఎఎన్‌ఎం జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:34 PM