Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌లో 36 పెద్ద పులులు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:05 AM
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో 36 పెద్ద పులులు ఉన్నట్లు టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ (ఎఫ్‌డీ) డాక్టర్ సునీల్ ఎస్ హిరమత్ తెలిపారు.

మన్ననూర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో 36 పెద్ద పులులు ఉన్నట్లు టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ (ఎఫ్‌డీ) డాక్టర్ సునీల్ ఎస్ హిరమత్ తెలిపారు. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో 2024-25 4వ ఫేజ్ పర్యవేక్షణ ఫలితాలను గురువారం ఆయన మీడియాకు తెలిపారు. నాలుగు నెలల వ్యవధిలో 10 అటవీ రేంజ్‌లలోని 797 లొకేషన్లలో 1594 సీసీ ట్రాప్ కెమెరాల ద్వారా ఈ పులులను గుర్తించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి