Share News

Patancheru: లిఫ్ట్‌ తెగి పడి 14 మందికి గాయాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:41 AM

లిఫ్ట్‌ వైర్‌ తెగి కిందపడటంతో అందులో ఉన్న 14 మంది మహిళలు గాయపడిన సంఘటన పటాన్‌చెరు పరిధి రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.

Patancheru: లిఫ్ట్‌ తెగి పడి 14 మందికి గాయాలు

రామచంద్రాపురం టౌన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): లిఫ్ట్‌ వైర్‌ తెగి కిందపడటంతో అందులో ఉన్న 14 మంది మహిళలు గాయపడిన సంఘటన పటాన్‌చెరు పరిధి రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేయడానికి కూకట్‌పల్లి ఎల్లమ్మబండకు చెందిన మహిళలు వచ్చారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వారు అక్కడ పనిచేశారు.


ఉదయం తొమ్మిది గంటలకు ఇంటికి తిరిగి వెళ్లేందుకు రెండో అంతస్తులో మహిళలందరూ ఒకేసారి లిఫ్ట్‌ ఎక్కారు. కిందికి వస్తున్న సమయంలో లిఫ్ట్‌ వైర్‌ తెగి.. ఒక్కసారిగా కిందపడటంతో వాటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 15 , 2025 | 04:41 AM